గాజాలో శాంతి చర్చల ప్రభావంతో తగ్గిన సురక్షిత పెట్టుబడుల డిమాండ్ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు మార్కెట్లో ఒడుదొడుకులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు గత రెండు నెలలుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు, డాలర్ బలం పుంజుకోవడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడానికి మొగ్గు చూపడంతో ఈ విలువైన లోహాల ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనా, ఇండియాతో అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపించడం వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు. “అంతేకాక, గాజాలో శాంతి చర్చలు సానుకూలంగా సాగుతుండటం వల్ల పెట్టుబడిదారులు లాభాలు స్వీకరిస్తున్నారు. అందుకే ధరలు తగ్గాయి” అని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గినప్పుడు,…
Read More