కొండ కింద రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్ల పనులు మంచినీరు, టాయిలెట్ల బాధ్యతలు విజయవాడ కార్పొరేషన్‌కు అంచనా కన్నా ఎక్కువ ధరకు ఖరారైన సీసీటీవీల టెండర్ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం కనకదుర్గమ్మ ఆలయ అధికారులు సన్నాహాలను వేగవంతం చేశారు. ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువన రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే, ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, చాలా పనులు తాత్కాలికంగానే ఉండటంతో వ్యయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పనులకు భారీ వ్యయం దసరా ఉత్సవాల కోసం కొండ దిగువన తాత్కాలిక క్యూ లైన్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలు, స్నానఘట్టాల వద్ద షెడ్లు, విద్యుత్ అలంకరణ, మైక్ సెట్ల…
Read More