గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అలైన్మెంట్ దాదాపు ఖరారు నాలుగున్నర గంటల ప్రయాణం రెండున్నర గంటలకు తగ్గింపు ప్రస్తుత మార్గం కంటే 57 కిలోమీటర్లు తగ్గనున్న దూరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రాజధానులైన హైదరాబాద్ మరియు అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఈ కొత్త రహదారి మార్గం అమల్లోకి వస్తే, ప్రస్తుతం ఉన్న నాలుగున్నర గంటల ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలకు తగ్గిపోతుంది. ఎక్స్‌ప్రెస్‌వే మార్గం ఈ ఎక్స్‌ప్రెస్‌వే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న తిప్పారెడ్డిపల్లి వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఇది వెళ్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి వద్ద…
Read More