బంగాళాఖాతంలో అల్పపీడనంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేని వాన నగరంలోని అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్ వంటి అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని ఐటీ కంపెనీలకు కీలక సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కంపెనీలు సహకరించాలని, ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని…
Read MoreTag: #HyderabadTraffic
RevanthReddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: రక్షణ భూముల బదలాయింపుపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటీ
రాజీవ్ రహదారి విస్తరణకు 83 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన సీఎం మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణంపై చర్చ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపైనా ప్రస్తావన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈరోజు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే రాజీవ్ రహదారిపై ప్యాకేజీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్…
Read More