జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీ ముగ్గురి పేర్ల పరిశీలన అనంతరం దీపక్‌రెడ్డి వైపే మొగ్గు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలువురు నాయకుల పేర్లను పరిశీలించిన పార్టీ జాతీయ నాయకత్వం, చివరకు దీపక్‌రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ బరిలో నిలిపే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపించారు. దీనిపై ఆదివారం సమావేశమైన…
Read MoreTag: #JubileeHills
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కవిత వ్యూహం
మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌కు ఉపఎన్నిక రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన జాగృతి తరఫున విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం విష్ణుతో కవిత భేటీ.. అరగంటకు పైగా మంతనాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నికను ఆమె ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి తరఫున ఒక సొంత అభ్యర్థిని బరిలోకి దింపడానికి కవిత సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ…
Read MoreMaheshKumarGoud : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ విజయం ఖాయం – మహేశ్ కుమార్ గౌడ్
MaheshKumarGoud : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ విజయం ఖాయం – మహేశ్ కుమార్ గౌడ్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గత నెలలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై టీపీసీసీ చీఫ్ ధీమా: కాంగ్రెస్‌లో చేరిన పలువురు నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గత నెలలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్…
Read More