హైదరాబాద్ రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి ఈ-వేలం వేలం ద్వారా కనీసం రూ.2000 కోట్ల ఆదాయం అంచనా అక్టోబర్ 6వ తేదీన ఆన్‌లైన్‌లో జరగనున్న వేలం పాట తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను రూ. 101 కోట్లుగా నిర్ణయించడం విశేషం. ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలం వివరాలు స్థలం: గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో మొత్తం 18.67 ఎకరాల భూమిని వేలానికి పెట్టారు. ప్లాట్లు: ఇందులో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు,…
Read More