36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం నేడు నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో వర్షాలు రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల అంచనా వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, రానున్న 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రానికి ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
Read MoreTag: #LowPressure
AP : బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాంధ్రకు భారీ వర్షాలు
AP : బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాంధ్రకు భారీ వర్షాలు: అరేబియా సముద్రం నుండి ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది: అల్పపీడనం ఏర్పడే అవకాశం అరేబియా సముద్రం నుండి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది.…
Read More