రవితేజ తాజా చిత్రంగా ‘మాస్ జాతర’ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల ఆరంభంలో ఎవరూ వేషాలు ఇవ్వలేదన్న రవితేజ నటుడు రవితేజ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు (మాస్ ఇమేజ్)ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించింది. ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.…
Read More