నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల: తెలుగు విద్యార్థుల సత్తా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఎన్‌టీఏ తుది ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఈమెయిల్ ద్వారా లేదా తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి చూసుకోవచ్చని ఎన్‌టీఏ సూచించింది. తెలుగు రాష్ట్రాల…
Read More