RevanthReddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: రక్షణ భూముల బదలాయింపుపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటీ

Telangana CM Revanth Reddy's Delhi Visit: Key Meeting with Defense Minister Rajnath Singh on Transfer of Defense Lands

రాజీవ్ రహదారి విస్తరణకు 83 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన సీఎం మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణంపై చర్చ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపైనా ప్రస్తావన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈరోజు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే రాజీవ్ రహదారిపై ప్యాకేజీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్…

Read More