Musi River : మూసీ ఉగ్రరూపం, MGBS బస్టాండ్‌లో వందలాది మంది చిక్కుకుపోయారు

Musi River Swells, Traps Hundreds at MGBS Bus Station

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్‌లోకి వరద బస్టాండ్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్‌లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న…

Read More

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం

himachal floods

డెహ్రాడూన్‌ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్‌లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం…

Read More

Mahbub Nagar:రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

Army, NDRF, ST DRF and Singareni teams are already working hard in the rescue operation.

Mahbub Nagar:రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్:శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు గత శనివారం అర్ధరాత్రి ఘటన స్థలానికి రక్షణ బృందాలు చేరుకున్నాయి. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. మహబూబ్ నగర్, ఫిబ్రవరి 25 శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు గత శనివారం అర్ధరాత్రి ఘటన…

Read More