ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన కుక్కల దాడి భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు తాళ్ల సహాయంతో సురక్షితంగా కిందకు దించిన స్థానికులు ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కింది. ఈ ఘటన భోరజ్ మండలం నిరాల గ్రామంలో జరిగింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట కట్టేశాడు. ఆదివారం ఉదయం కొన్ని వీధికుక్కలు ఆ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసి భయపడిన ఎద్దు, తన కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు తీసింది. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో, పక్కనే ఉన్న రాళ్లపైకి ఎక్కి, అక్కడి నుంచి ఇంటి పైకప్పు మీదకు దూకింది. ఇంటి పైకప్పుపై ఎద్దును చూసి…
Read More