పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మాచర్లలో ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగం రాష్ట్రంలో చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఉద్ఘాటన పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఇటీవల వరకు ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా అక్కడికి వెళ్లలేని దుస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు కల్పించామని ఆయన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేవలం చెత్తనే కాకుండా, “చెత్త రాజకీయాలను” కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. “పల్నాడులో అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే…
Read More