Same…Sean… | సేమ్…సీన్… | Eeroju news

Same...Sean...

సేమ్…సీన్… పార్టీలు మార్పు అంతే హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Same…Sean… తెలంగాణలో బొటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో విపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు. కానీ, ఈ విషయంలో గతంలో కేసీఆర్‌ చేసిన తప్పే ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నామని మర్చిపోతున్నారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీచేసి ఓడి పోయినవారిపై ప్రభావం పడుతోంది. ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు. దీంతో గతంలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్‌ అనాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి, కొత్తగా…

Read More

Hastam Gutiki is another MLA | హస్తం గూటికి మరో ఎమ్మెల్యే | Eeroju news

Hastam Gutiki is another MLA

హస్తం గూటికి మరో ఎమ్మెల్యే హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Hastam Gutiki is another MLA : ప్రతిపక్ష BRS పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి BRS ను వీడి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ భావజాలంతో కలిసి పనిచేసే వారిని అందర్నీ కలుపుకుని వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కొన్ని నెలలపాటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ స్థానాలు నెగ్గడంపై ఫోకస్ చేసింది. సార్వత్రిక…

Read More

Phased loan waiver | దశలవారీగా రుణమాఫీ

హైదరాబాద్ దశలవారీగా రుణమాఫీ,  రూ.రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి రెండు విడతలో…! జులై మొదటి వారం నుంచి పంద్రాగస్టు వరకు అమలు చేసే యోచన. Phased loan waiver : ఒక రైతుకు. ఐదు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా.! వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ, మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా…

Read More

CM Revanth Reddy laid foundation stone for ATCs at Mallepally ITI | మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన        

Revanth reddy

హైదరాబాద్ జూన్ 18 CM Revanth Reddy laid foundation stone for ATCs at Mallepally ITI : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు శంకుస్థాపన చేశారు. ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఎటిసి) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటిఐల‌ను ఎటిసిలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటిఐల‌నుఎటిసిలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టిటిఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవొయు) కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐటిఐలను ప్రక్షాళన చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమన్నారు. అందులో భాగంగానే వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్…

Read More

డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ | MLA Sriganesh inspected the double bedroom houses | Eeroju news

డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సికింద్రాబాద్ MLA Sriganesh inspected the double bedroom houses : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు  2వ వార్డు పరిధిలోని రసూల్ పుర సిల్వర్ కంపెనీ,  నారాయణ జోపిడి ప్రాంతలలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను పరిశీలించారు.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వారి సాధకబాధలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా  శ్రీగణేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తానని, నాపై నమ్మకంతో  గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయింపులు చేస్తాం…

Read More

ఇక టీ కాంగ్రెస్ పై గురి… | Aiming at Tea Congress… | Eeroju news

ఇక టీ కాంగ్రెస్ పై గురి… ఖమ్మం, జూన్ 13, (న్యూస్ పల్స్) Aiming at Tea Congress… పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులకు వేళ అయింది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. కొత్త పీసీసీ విషయంలో ఇప్పటికే తన ఆలోచనలు పంచుకున్న సీఎం.. క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ మార్పు తర్వాతే ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు టాక్. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ నెల 27తో పీసీసీ చీఫ్‌గా ఆయన మూడేళ్ల పదవీకాలం ముగియనుంది.…

Read More

భూముల ధరల పెంపుదలపై మధనం | Madhanam on increase in land prices | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో 400కుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా.. ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మరోవైపు మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి హామీల అమలుపై దృష్టిపెట్టారు.ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టిపెట్టారు. రుణమాఫీ అర్హులను గుర్తించేందుకు కండీషన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ రేవంత్‌కు సవాల్‌గా మారింది.శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయా శాఖల నుంచి రావాల్సిన బకాయిలు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెంపుపైనా దృష్టి పెట్టారు. భూముల…

Read More

పరిపాలనపై పట్టు సాధించని రేవంత్ | Revanth who has not mastered the administration | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పరిపాలన ఇంకా  గాడిన పడలేదు.  ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా గందరగోళంగా మారిపోయింది.  అధికారంలోకి వచ్చిన తర్వాతే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసినా.. అందులో సీఎం కేసీఆర్ అంటూ పేజీలు ముద్రించారు. అవి పంపిణీకి వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదు. మరో వైపు గత ప్రభుత్వంలో అవినీతి పై జరుగుతున్న విచారణల్లో ఒకరు ముందు.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తి పట్టు లేదన్న అభిప్రాయం కలుగుతుంది. అదే నిజమని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. మొత్తం…

Read More

ఫేక్ జీవోలు…మండిపడుతున్న టీ కాంగ్రెస్… | Fake creatures.. Burning Tea Congress… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. ఇది ముమ్మాటికి నిజమనిపిస్తుంది కొన్ని సీన్స్‌ను చూస్తే.. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ TS నుంచి TGకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2 వేల కోట్లు అంటారు.. మరికొందరు 4 వేల కోట్లు అంటారు. ఇంతకీ ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..?తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో.. TS నుంచి TGగా పేరు మార్చడం ఒకటి.. మరి చెప్పినంత ఈజీగా జరగదు కదా పని.. గవర్నమెంట్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఈ మార్పు జరగాలి.. దీనికి కాస్త ఖర్చవుతుంది.. ఇది నిజం.. బట్.. ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా? అని ఎదురుచూసే విపక్షం.. దీనిని అస్త్రంగా మలుచుకుంది.…

Read More

రుణమాఫీపై కొత్త గైడ్ లైన్స్… | New guidelines on loan waiver… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని గత కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో రుణమాఫీపై రేవంత్ సర్కార్…గట్టిగా ఫోకస్ చేసే పనిలో పడింది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో… ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కటాఫ్ తేదీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన…

Read More