హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయి. ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగానే ఉంచారు. అనేక శాఖలను పలువురు మంత్రులు చూస్తున్నారు. ఇది వారికి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈసారి వారికి అవకాశమివ్వాలని నిర్ణయించారని తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయిన రేవంత్ ఈ మేరకు విస్తరణకు సంబంధించిన హామీని పొందినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో…
Read MoreTag: revanth reddy
రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం | Cabinet meeting to finalize the procedures for the implementation of farmer loan waiver | Eeroju news
హైదరాబాద్ రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి. వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం.. అందుబాటులో ఉన్న వనరులు, నిధుల…
Read Moreకేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు | Revanth Reddy advice to Central Ministers | Eeroju news
హైదరాబాద్, జూన్ 10 కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు. …
Read More