పవన్ కళ్యాణ్ సొంత గ్రామం దత్తత, అభివృద్ధికి రూ.50 లక్షల కేటాయింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలంలో ఉన్న తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నిధులను మంజూరు చేశారు. నిన్న నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ కొణిదెల గ్రామ పరిస్థితి గురించి వివరించారు. దీంతో ఆయన ఆ…
Read MoreTag: roads
Roads | కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు | Eeroju news
కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు కడప, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Roads ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడం వెనుక మతలబు ఏమిటని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. కోవిడ్ తర్వాత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు 50ఏళ్ల నిడివితో నాలుగు శాతం వడ్డీలకు కేంద్రం అప్పులు ిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ప్రత్యేక సహాయం’ కేటగిరీ లో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రాజెక్టులకు ఇటీవల బిల్లులు చెల్లించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి సహాయాన్ని…
Read Moreనిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారిన రోడ్డు. | The road was covered with dirt within a few days of its construction. | Eeroju news
డుంబ్రిగుడ మండలంలో నూతనంగా నిర్మించిన 516 ఈ హైవే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారుతుండడంతోపాటు బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగిపోతుండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లాపుట్టు, కించుమండ మధ్యలో ఇటీవల నిర్మించిన హైవే రోడ్డు బీటలు వారగా , బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగబడుతుంది. దీన్ని గమనించకుండా వాహనదారులు ప్రయాణిస్తూ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వాహనదారులు అంటున్నారు. నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు బీటలు వారుతుండడంతో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More