Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అధ్వాన్నంగా కంటోన్మెంట్ రోడ్లు

0

హైదరాబాద్, అక్టోబరు 7,(న్యూస్ పల్స్)
సికింద్రాబాద్ లోని ఏఓసి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సికింద్రాబాద్ లోని ఏఓసి ప్రాంతంలో గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం చేయలేక వాహణదారులు,స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. రోడ్లపై లోతు గుంతలు ఉండడంతో అటు వాహనాలు ఇటు ఆరోగ్యం రెండు దెబ్బ తింటున్నాయి అంటున్నారు స్థానికులు. ఇన్ని రోజులు వర్షాకాలం పేరిట రోడ్డు మరమ్మతులు చేయలేదని ఇప్పుడు వర్షాకాలం ముగిసిన తరువాత కూడా రోడ్డు మరమ్మతులు చేయడంలో ఎలాంటి పురోగతి లేదంటున్నారు వాపోతున్నారు. కాగా ఈ ఏఓసి గేట్ల మార్గం నగరంలో కొన్ని కీలక ప్రాంతాలను కలుపుతుంది. ఇలాంటి ప్రధాన మార్గం ఇంత అధ్వానంగా ఉంటే బోర్డు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోడంలేదో తమకు అర్దం కావడం లేదంటున్నారు.ఏఓసీ రోడ్డుపై డ్రైవింగ్‌ చేయాలంటే భయంగా ఉందని రోజూ ఈ మార్గంలో వెళ్ళే పి. నందిని చెప్పారు.గుంతలు చాలా లోతుగా ఉన్నాయని,తద్వారా వాహణదారులు , హార్ట్ పేషంట్లు మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆ రోడ్డు పై వెళ్లాలంటే భయపడుతున్నట్లు చెప్పారు.

Prostitution in Panjagutta Hyderabad వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఇక రోడ్ల పై దుమ్ము కూడా తీవ్రంగా ఉండటంతో డ్రైవింగ్ కు అంతరాయం కలుగుతుందన్నారు.ఈ సమస్యలన్నీ పెద్ద ప్రమాదలకు దారి తియ్యకముందే అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని నందిని కోరారు. AOC రోడ్ల పై నిత్యం ప్రయాణించే మరో వాహనదారుడు బోజా కార్తికేయ మాట్లాడుతూ… ఇక్కడి రోడ్ల తో వచ్చే అసలు సమస్య కేవలం అసౌకర్యానికి సంబంధించింది కాదని అసలు సమస్య ప్రజల ఆరోగ్య భద్రత ప్రమాధానికి సంబంధించిందన్నారు.అధికారులు స్పందించి తక్షణం మరమ్మతులు పనులు ప్రారంభించాలన్నారు. తమకు తాత్కాలిక పరిష్కారం అవసరం లేదని… శాశ్వత పరిష్కారం కావాలని ఆయన కోరారు.రోడ్డు ప్రమాదకర పరిస్థితుల ఉన్న కారణంగా ఇటీవల ద్విచక్రవాహనదారుడు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారని మారెడపెళ్లికి చెందిన ఆక్టావియో సౌజా తెలిపారు. అనేక మంది క్రీడాకారులు మరియు సైక్లిస్టులు ఈ ప్రాంతానికి తెల్లవారుజామున తరచుగా వస్తుంటారాన్నారు. రోజూ ఈ మార్గాల్లో వెళ్లే వారికి తప్పకుండా మెడ లేదా వెన్నెముక నొప్పులు వస్తాయన్నారు.SCB సివిల్-నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ జె. మాట్లాడుతూ… సైనిక అధికారులతో చర్చలు జరిపామన్నారు.ఏఓసి వద్ద రోడ్ల దుస్థితి, అలాగే ఇంట్రెంచ్‌మెంట్ రోడ్డు పరిస్థితిని పరిష్కరించేందుకు త్వరలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడితో మాట్లాడుతామని, ఇప్పటికే చాలా నెలల క్రితమే ప్యాచ్‌వర్క్‌లు చేశామని చెప్పారు. అయితే త్వరలో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie