బోయినపల్లి బస్టాప్‌లో ప్రయాణికుడి ఫోన్ చోరీ రెండు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ కొత్త సిమ్ వాడటంలో ఆలస్యమే కారణమన్న పోలీసులు హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పోయిన సెల్‌ఫోన్ ఓ ప్రయాణికుడికి తీరని నష్టాన్ని కలిగించింది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6.15 లక్షలు మాయం కావడంతో బాధితుడు నిస్సహాయంగా రోదిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్‌లో నాందేడ్‌కు వెళ్లే బస్సు ఎక్కారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గమనించారు. వెంటనే అప్రమత్తమై బోధన్‌కు చేరుకున్న తర్వాత పాత నంబర్‌ను బ్లాక్ చేయించి, అదే నంబర్‌పై కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు.…
Read More