స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కావన్న సమంత రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని వ్యాఖ్య ప్రపంచానికి మహిళల నాయకత్వం అవసరమన్న సామ్ స్టార్ హీరోయిన్ సమంత తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కాదని, ఒక స్టార్‌గా ఉన్నప్పుడు నలుగురికి స్ఫూర్తిగా నిలవడమే అసలైన విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంటూ, తన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “నటీమణులకు కెరీర్ సమయం చాలా తక్కువగా ఉంటుందని నేను భావిస్తాను. స్టార్‌డమ్, గుర్తింపు లాంటివి ఉత్సాహాన్నిస్తాయి, కానీ అవేవీ శాశ్వతం కాదు. ఒక స్టార్‌గా కొనసాగుతున్నప్పుడు కనీసం కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలగాలి. ఇతరులపై ప్రభావం చూపాలని ప్రతి ఒక్కరూ స్వయంగా…
Read More