తెలంగాణలో సినిమా షూటింగ్లకు అటవీ ప్రాంతాల్లో అనుమతి సుమారు 70 లొకేషన్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తు.. కేవలం 24 గంటల్లోనే పర్మిషన్లు తెలంగాణలో సినిమా పరిశ్రమ మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘సింగిల్ విండో’ విధానాన్ని ప్రవేశపెడుతూ, దరఖాస్తు చేసుకున్న కేవలం 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల సినీ నిర్మాతలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి. ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ పేరిట ప్రత్యేక వెబ్సైట్ ఈ నూతన విధానంలో భాగంగా ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ పేరుతో ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది. షూటింగ్లకు…
Read More