ఐబొమ్మ బెదిరింపుల వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడి స్పష్టతనిచ్చిన ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి 2023 నాటి పాత స్క్రీన్‌షాట్లు అని వెల్లడి తెలుగు సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) తెలంగాణ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. గత కొద్ది రోజులుగా, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసుల రహస్య ఫోన్ నంబర్లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించడంతో ఇది మరింత వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం…
Read More