B.R. Gavai : న్యాయమూర్తులు పౌరుల హక్కుల సంరక్షకులు: సీజేఐ జస్టిస్ గవాయ్:పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తులదేనని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. తీర్పులు వెలువరించేటప్పుడు న్యాయమూర్తులు స్వతంత్రంగా ఆలోచించాలని, ప్రజల వ్యాఖ్యలకు ప్రభావితం కారాదని ఆయన సూచించారు. రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులే సంరక్షకులు: సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తులదేనని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. తీర్పులు వెలువరించేటప్పుడు న్యాయమూర్తులు స్వతంత్రంగా ఆలోచించాలని, ప్రజల వ్యాఖ్యలకు ప్రభావితం కారాదని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం అమరావతిలో నిన్న జరిగిన సన్మాన సభలో జస్టిస్ గవాయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని…
Read MoreTag: Supreme Court
Supreme Court : సుప్రీంకోర్టు తీర్పు ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే యాజమాన్యానికి సరిపోదు
ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు, న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో చాలామంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆస్తిని వినియోగించుకోవడం, నిర్వహించడం, బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన యాజమాన్యం కిందకు వస్తాయని కోర్టు వివరించింది. “కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు” అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. యాజమాన్యాన్ని…
Read MoreSupreme Court | మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే | Eeroju news
మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే న్యూఢిల్లీ అక్టోబర్ 21 Supreme Court మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపి, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. యూపి ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ జామియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి. పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు…
Read MoreSupreme Court | సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం | Eeroju news
సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం న్యూఢిల్లీ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Supreme Court తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరింది. సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సిట్ నియమించారు. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నైతిక బలాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకూ తమ వాదన ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారాలేవని ప్రశ్నించిందని.. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో వైసీపీ కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు…
Read More