విశాఖలో ‘స్వస్త్ నారీ’ కార్యక్రమం… హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం అన్న చంద్రబాబు ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య…
Read MoreTag: #Telugu
Eye Health : గుండె జబ్బులు, కంటి చూపు మధ్య సంబంధం
హృద్రోగ బాధితుల్లో కంటి చూపు మందగిస్తుందంటున్న నిపుణులు రక్త ప్రసరణ సాఫీగా జరగకపోవడమే కారణమని వివరణ మధుమేహంతో కంటి సమస్యలతో పాటు గుండెకూ ముప్పు హృద్రోగులకు కంటి సమస్యలు గుండె జబ్బులకు, కంటి చూపుకు మధ్య సంబంధం ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. గుండె జబ్బులు ఉన్నవారిలో కంటి చూపు తగ్గడం లేదా కంటికి సంబంధించిన ఇతర సమస్యలు సాధారణం. గుండెపోటు లక్షణాలను కంటి పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల కంటి నరాలకు రక్తం సరిగా అందక కంటి చూపు మందగిస్తుంది. గుండె విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి కూడా గుండె పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. గుండెపోటు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో గుండెపోటు ఒకటి.…
Read More