ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రాన పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యజమానులు, న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని, చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో చాలామంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆస్తిని వినియోగించుకోవడం, నిర్వహించడం, బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన యాజమాన్యం కిందకు వస్తాయని కోర్టు వివరించింది. “కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు” అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. యాజమాన్యాన్ని…
Read More