Revanth Reddy Football Practice : మెస్సీతో మ్యాచ్ కోసం ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Football Practice

Revanth Reddy Football Practice Revanth Reddy Football Practice : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షూలు తొడిగి గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ జట్టుతో జరగనున్న ప్రత్యేక మ్యాచ్‌ కోసం సీఎం సిద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఆయన సుమారు గంటపాటు శిక్షణ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాటు కానుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీమ్‌తో కలిసి ఆడనున్నారు. ఇందుకోసమే సీఎం ముందుగానే ప్రాక్టీస్‌ను…

Read More

SamanthaRuthPrabhu : సమంత రాజ్‌ నిడిమోరు డేటింగ్‌: దీపావళి ఫొటోలతో బలపడుతున్న ఊహాగానాలు!

Samantha Ruth Prabhu and Raj Nidimoru Dating Rumours Gain Momentum After Diwali Celebrations

బాలీవుడు దర్శకుడు రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి వేడుకలు ఫోటోలు షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్న సమంత టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. తాజాగా రాజ్‌ నిడిమోరు కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాణసంచా కాలుస్తున్న ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. “నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అని వ్యాఖ్యానించారు. ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో రాజ్‌-డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌లలో సమంత నటించిన విషయం…

Read More

Sai Pallavi : ఒకే ఒక్క పోస్టుతో AI బికినీ వివాదానికి సాయిపల్లవి ఫుల్‌స్టాప్!

The Clever Response: Sai Pallavi Puts an End to the Viral AI-Generated Bikini Photo Controversy

సాయిపల్లవి బికినీ ఫొటోలంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం అవి నిజమైనవా, ఏఐ క్రియేషనా అని నెటిజన్ల మధ్య వాడీవేడి చర్చ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫొటోలతో వివాదానికి తెరదించిన నటి సినీ నటి సాయిపల్లవి తనవంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బికినీ ఫొటోల వివాదానికి ఒకే ఒక్క పోస్టుతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎవరినీ విమర్శించకుండా చాలా తెలివిగా వ్యవహరించిన ఆమె తీరుకు అభిమానుల ప్రశంసలు దక్కుతున్నాయి. సహజ నటన, సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చే ఆమె ఇమేజ్‌ను దెబ్బతీసేలా జరిగిన ఈ ప్రచారంపై ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వివాదానికి దారితీసిన ఫొటోలు గత కొద్ది రోజులుగా సాయిపల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. తన సోదరి పూజ కన్నన్‌తో కలిసి బీచ్‌లో ఉన్నట్లుగా ఉన్న ఈ…

Read More