కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న నాగ్ అశ్విన్ జరిగిన దాన్ని మనం మార్చలేమని ట్వీట్ దీపికను ఉద్దేశించే అంటున్న నెటిజన్లు కల్కి 2898 AD చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీపికా పదుకొణెతో తలెత్తిన వివాదంపై పరోక్షంగా స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా, నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని పంచుకున్నారు. అందులో, “నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని కృష్ణుడు అశ్వత్థామతో చెప్పే డైలాగ్ ఉంది. ఈ వీడియోకు, “జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు” అనే క్యాప్షన్‌ను ఆయన జోడించారు. ఈ పోస్ట్‌ను నాగ్ అశ్విన్ పరోక్షంగా…
Read MoreTag: #VyjayanthiMovies
DeepikaPadukone : కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి దీపిక పదుకొణె ఔట్
అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీక్వెల్‌లో ఆమె పాత్రను కుదించడమే ప్రధాన కారణమని కథనాలు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ భారీ ప్రాజెక్టు నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. వైజయంతీ మూవీస్ తమ అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. “కల్కి 2898 ఏడీ సీక్వెల్ ప్రాజెక్టులో దీపికా పదుకొణె భాగం కావడం లేదని అధికారికంగా తెలియజేస్తున్నాము. అనేక చర్చల తర్వాత, మా ఇద్దరి దారులు వేరని నిర్ణయించుకున్నాం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహకారం, నిబద్ధత కుదరలేదు. ఆమె…
Read More