UPSC NDA & NA (I) 2026 నోటిఫికేషన్ విడుదల – 394 ఖాళీలు
భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (I) – 2026 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 370 పోస్టులు, మహిళలకు 24 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు ఇండియన్ నేవల్ అకాడమీ (NA) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఆర్మీ: 208 పోస్టులు
(పురుషులు – 198, మహిళలు – 10)
నేవీ: 42 పోస్టులు
(పురుషులు – 37, మహిళలు – 5)
ఎయిర్ ఫోర్స్ (ఫ్లయింగ్ బ్రాంచ్): 92 పోస్టులు
(పురుషులు – 90, మహిళలు – 2)
గ్రౌండ్ డ్యూటీస్ (టెక్నికల్): 18 పోస్టులు
(పురుషులు – 16, మహిళలు – 2)
గ్రౌండ్ డ్యూటీస్ (నాన్-టెక్నికల్): 10 పోస్టులు
(పురుషులు – 8, మహిళలు – 2)
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 24 పోస్టులు
(పురుషులు – 21, మహిళలు – 3)
అర్హతలు
సంబంధిత విభాగాన్ని బట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి
పురుషుల ఎత్తు: కనీసం 157 సెం.మీ
మహిళల ఎత్తు: కనీసం 152 సెం.మీ
వయోపరిమితి: 16½ నుంచి 19½ సంవత్సరాలు
జనన తేదీ:
1 జూలై 2007కి ముందు
1 జూలై 2010కి తరువాత జన్మించినవారు అనర్హులు
దరఖాస్తు ఫీజు
జనరల్ / ఓబీసీ అభ్యర్థులు: రూ.100
ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
ఎంపిక విధానం
రాత పరీక్ష
SSB ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చివరి తేదీ: 30 డిసెంబర్ 2025
రాత పరీక్ష తేదీ: 12 ఏప్రిల్ 2026
రాత పరీక్ష ఫలితాలు: మే 2026
SSB ఇంటర్వ్యూలు: జూన్ – జూలై 2026
NDA 157వ కోర్సు ప్రారంభం: 1 జనవరి 2027
NA 119వ కోర్సు ప్రారంభం: 1 జనవరి 2027
రాత పరీక్ష విధానం
మ్యాథమెటిక్స్ – 300 మార్కులు
జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT) – 600 మార్కులు
మొత్తం మార్కులు – 900
అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి
నెగటివ్ మార్కింగ్ ఉంటుంది
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 900 మార్కులకు SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Read more: Government jobs: Intelligence Bureau (IB) MTS Recruitment 2025 – 362 Vacancies, Apply Online
