శ్రీకాకుళం, మే 19, (Eeroju)
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు రైళ్లను కేటాయించింది కేంద్రం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఒక రైలు నడుస్తుంటే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ పరుగులు పెడుతోంది. తాజాగా మరో (మూడోది) వందేభారత్ ఏపీ మీదుగా నడవబోతోందనే ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు. వందేభారత్ రైలు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ రైలు రాత్రి 7.15 గంటల సమయంలో స్టేషన్‌లో ఆగింది.. ఈ వందేభారత్‌ను చూసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు.. తమ మొబైల్స్‌లో సెల్ఫీలు దిగారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పలాసకు తొలిసారి రావడం విశేషం.. దీని గురించి జనాలకు కూడా ఎలాంటి సమాచారం లేదు.
నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్
అంతేకాదు ఈ రైలు ఆగడాన్ని చూసి రైల్వే సిబ్బంది కూడా ఒకింత ఆశ్చర్యపోయారు. ఈ వందేభారత్ దాదాపు పది నిమిషాల పాటు పలాస రైల్వే స్టేషన్‌లో ఆగిందట. డ్రైవర్లు, గార్డులు మారిన తర్వాత అక్కడి నుంచి రైలు అక్కడి నుంచి కదిలింది.ఏపీ మీదుగా మూడో వందేభారత్ పరుగులు పెట్టబోతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ రైలును విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారనే చర్చ జరుగుతోంది. వందేభారత్ వేగానికి తగిన విధంగా ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి విజయవాడ వరకు ఈ రైలు నడుస్తుందనే ప్రచారం మొదలైంది.
ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుందనే క్లారిటీ లేకపోయినా.. ట్రయల్ రన్ మాత్రం నిర్వహించినట్లు చెబుతున్నారు.కేంద్రం కూడా దేశంలో అనేక నగరాలు, ముఖ్య పట్టణాలు, రాష్ట్ర రాజధానులకు వందేభారత్ రైళ్లను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే భువనేశ్వర్ నుంచి ఈ వందేభారత్‌ను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ రైలుపై క్లారిటీ రావాల్సింది ఉండగా.. ప్రస్తుతం ట్రయల్ రన్ కోసం పట్టాలెక్కించారని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ రైలు ప్రారంభమైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఆసక్తికరంగా మారింది.
మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వందేభారత్ విశాఖకు నడుస్తోంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. రాజమండ్రి 7.55, విజయవాడ 10.00.. ఖమ్మం 11.00.. వరంగల్ 12.05.. సికింద్రాబాద్ 14.15 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 15.00 (3 గంటలు) గంటలకు బయల్దేరి.. వరంగల్ 16.35.. ఖమ్మం 17.45.. విజయవాడ 19.00.. రాజమండ్రి 20.58.. విశాఖ 23.30 (11) గంటలకు వస్తుంది. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది.అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఉదయం 6గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. నల్గొండకు ఉదయం 7.30కు చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరుకు 9.40.. ఒంగోలు 11.10.. నెల్లూరు మధ్యాహ్నం 12.30 గంటలకు వెళుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్ వచ్చేస్తుంది. ఈ రైలు మంగళవారం అందుబాటులో ఉండదు.