హైదరాబాద్, మే 19, (eeroju)
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసే సమయంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుడిని మళ్లీ ఎప్పుడు విడుదల చేయాలో ముందే నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించింది.వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు 2019లో డిపాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతని బెయిల్ రద్దు కోసం సిబిఐ పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. చివరకు గత నెలలో నిందితుడు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని, బెయిల్ రద్దు చేసింది. అదే సమయంలో నిందితుడికి డిఫాల్ట్‌గా జులై 1న విడుదల చేయాలని సూచించింది.
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారు మారు చేసే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు.వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ రద్దు చేసే సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జులై 1న బెయిల్‌పై విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 27న జారీ చేసిన ఉత్తర్వుల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి.
ఇవేం ఉత్తర్వులంటూ విస్మయం వ్యక్తం చేశారు.ఏప్రిల్ నెల 27న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ.. మే 5వ తేదీ లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును జూన్ 30 లోపు ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో గంగిరెడ్డిని జులై 1న పూచీకత్తు తీసుకొని బెయిల్‌పై విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది.వాదనలు ప్రారంభమైన వెంటనే సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు ఉత్తర్వుల గురించి ధర్మాసనానికి వివరించారు. ఇదో విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన సీజేఐ ఒకవైపు బెయిల్ రద్దు చేస్తూనే మరోవైపు ఫలానా రోజు విడుదల చేస్తున్నాం అని చెప్పడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.ఈ కేసులో నిందితుడు డీఫాల్ట్ బెయిల్‌పై ఉన్నా, దాన్ని రద్దు చేయాలని గతంలో జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం చెబితే, ఇప్పుడు హైకోర్టు జులై 1న విడుదల చేయాలని హైకోర్టు చెప్పడమేంటని ప్రశ్నించారు.
జూన్ 30వ తేదీ లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కావాలంటే నిందితుడు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.దీనిపై సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను బట్టి బెయిల్ ఇవ్వాలా, వద్దా.. అనే దానిపై ట్రయల్ కోర్టు తాను స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండేదని, అలా చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.పిటిషనర్ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సీజేఐ ఈ కేసులో ప్రతివాదులైన సీబీఐ, ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గంగిరెడ్డి ప్రస్తుతం కారాగారంలో ఉన్నందున జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేయాలని సూచించారు. కేసు విచారణను జూన్ మొదటి వారానికి వాయిదా వేశారు. జూన్‌లో వేసవి సెలవుల ధర్మాసనం గంగిరెడ్డి వ్యవహారంపై దాకలైన పిటిషన్ విచారిస్తుందని వెల్లడించారు.
తెలంగాణ హైకోర్టు తీర్పేపై సుప్రీం ఆశ్చర్యం