A place where you need to follow for what happening in world cup

విరూపాక్షకు భారీ ప్రిరిలీజ్ బిజినెస్

0

హైదరాబాద్, ఏప్రిల్ 20:మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. 2021 సెప్టెంబరులో బైక్ ప్రమాదానికి గురైన సాయి తేజ్.. కొన్నినెలల పాటు ఆసుపత్రికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్న అతడు.. చివరగా రిపబ్లిక్ మూవీలో నటించాడు. కాస్త గ్యాప్ తీసుకుని విరూపాక్షతో సందడి చేయనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 శుక్రవారం నాడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది. తెలుగు సహా కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. దీంతో విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేట్లకు మూవీని కొనుగోలు చేస్తున్నారు. నైజాం ప్రాంతంలో సాయితేజ్ మూవీని రూ. 7 కోట్ల వరకు అమ్ముడుపోయిందని ట్రేడ్ వర్గాల అంచనా. సీడెడ్ ప్రాంతంలో రూ. 3 కోట్ల 70 లక్షలు, ఆంధ్ర ప్రాంతంలో రూ.8 కోట్ల యాబై లక్షలకు కొనుగోలు చేశారట. ఈ రకంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.19 పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న ఈ మూవీ కర్ణాటక సహా ఇతర భాషల్లో కోటి యాభై లక్షలకు అమ్మడైనట్లు సమాచారం. ఓవర్సీస్‌లోనూ కోటి యాభై లక్షలకు విక్రయించారట. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల 20 లక్షల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. 23 కోట్ల 50 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా విరూపాక్ష నిలిచింది.

అతడు గత చిత్రాలైన రిపబ్లిక్‌కు రూ.12 కోట్లు, సోలో బతుకే సో బెటర్ 9 కోట్లు, ప్రతి రోజూ పండగే రూ.17 కోట్ల 80 లక్షల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ వరకు జరిగాయిఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందిస్తున్నారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Leave A Reply

Your email address will not be published.