Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అంగన్వాడీ తాళాలు బద్దలు కొడుతున్న సచివాలయ సిబ్బంది

అడ్డుకుంటున్న భవన యజమానులు

0

కాకినాడ

తాళాలు బద్దలు కొట్టడాన్ని నిరాకరిస్తూ,అద్దె బకాయిలు చెల్లించాలంటూ సచివాలయ సిబ్బందిని భవన యజమానులు  అడ్డుకుంటున్నారు. అంగన్వాడీల నిరసనతో మూసి ఉన్న అంగన్వాడి కార్యాలయాలను తెరిచేందుకు సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆయా అంగన్వాడి కార్యాలయాల తాళాలను బద్దలు కొట్టి ప్రవేశించే ప్రయత్నంలో  సచివాలయ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చాలా నెలలుగా అద్దె బకాయిలు ఉన్నాయని ఇప్పుడు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి ఇంటి యజమానులు అంగీకరించడంలేదు.
ఇంటి యజమానుల మాటలను ఖాదర్ చేయకుండా తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నంలో సచివాలయ సిబ్బంది వున్నారు. తాళాలు బద్దలు కొట్టేందుకు ఎటువంటి అధికారం మీకు ఉన్నది, ఉన్నచో సదరు అధికారులు జారీ లేఖ మాకు చూపించాలని ఇంటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. మాకు ఇవ్వవలసిన అద్దెలు చెల్లించాలని ఇంటి యజమానులు నిలదీయడంతో వచ్చిన అంగన్వాడి సూపర్వైజర్, సచివాలయ ఎడ్మిన్, వీఆర్వో సచివాలయ సిబ్బంది మద్యలో ఏమైతే అద్దె బకాయిలు ఉన్నాయో మాకు బిల్స్ రాగానే చెల్లిస్తామని ఇంటి యజమానులకు అంగీకార పత్రం ఇచ్చి అంగన్వాడి స్కూల్స్ కు ఉన్న తాళాలు బద్దలుగొడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie