Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు పార్టీలు… రెండు కుటుంబాలు…

0

విజయవాడ, జనవరి 18, (న్యూస్ పల్స్)
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన YSR వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హై కమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీ లో పవర్ లోకి రావడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు .YS షర్మిల.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లో నే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి ఊపిరి పోయ్యాలన్నా..గత వైభవం దిశగా పార్టీ నీ నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యం అని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది.  దానికి తోడు వైఎస్సార్ పై అభిమానం ఉండి.. జగన్ తో ఇమడ లేక పోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గం గా షర్మిల కనిపిస్తున్నారు . దానితో మరో ఆలోచన కు తావు లేకుండా ఆమెకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హై కమాండ్ పెద్దలు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం.

 

ఆ వర్గం కాంగ్రెస్ ముందు నుండీ అండగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్ అనంతరం ఏపీ లో అడుగుపెట్ట బోతున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది.పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతీ సారీ టీడీపీ తిరిగి నిలదొక్కుకుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు,చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు ఎనలిస్ట్ లు. 70ఏళ్ల పైబడ్డ వయస్సులో ఇప్పటికీ ఆయన పైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు. స్కిల్ స్కాం లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతి నీ ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక ప్రక్క అండగా ఉండగా . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు.ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజీపీ ఆశలు ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉన్నాయి . ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగ పడకపోవడంతో పురంధ్రీశ్వరి నే పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు. దానికి తగ్గట్టు గానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజీపీనీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వం తో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం . స్వయానా చంద్రబాబుకు వరసకు వదిన అయిన పురం ద్రీశ్వరి ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన ల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలకపాత్ర పోషించబోతున్నారు .ఏపీలో జనసేన కూడా కీలకంగా మారినా ఆల్రెడీ టీడీపీ తో పొత్తులోన్ ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు. కానీ మిగిలిన నాలుగు పార్టీలు..అందులో రెండు నేషనల్..రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు రెండు కుటుంబాల చేతుల్లోనే ఉండడం 2024 ఏపీ ఎన్నికల్లో ఒక విశేషం గా చెప్పుకోవచ్చు .

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie