ఆకుల లలితను ఆహ్వానించిన వైతెపా నేత
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారితో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం రమేష్ చర్చలు జరిపారు. పార్టీలో చేరాలని ఆకుల లలితను ని ఆహ్వానించారు. వైతె పార్టీ ఆహ్వానాన్ని ఆకుల లలిత స్వాగతించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.పార్టీలో చేరే అంశంపై త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆకుల లలిత తెలిపారు