కోనసీమ: కోనసీమ ప్రాంతంలో పరిచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వేసవి ఎండ తీవ్రత నుంచి వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. చాలాచోట్ల ఈదురుగాలితో కూడిన వర్షం కురుస్తుందనితో విపత్తులు నివారణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మెసేజ్ హెచ్చరికలను పంపిస్తోంది. కోనసీమలో గాలులు వర్షం వల్ల అరటి వరి పంటలకు నష్టం వాటిల్ల పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల వరి కోతలు అవుతుంటే మరికొన్నిచోట్ల నీటి ఎద్దడి వల్ల పంట ఆలస్యమై మరో 10 రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే గాలులకు వర్షానికి వరి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.