Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నీచ సంస్కృతికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారారు… మంత్రి అంబటి రాంబాబు….

0

గుంటూరు నా రెండో కుమార్తె భర్త నాపై కొన్ని కామెంట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. నా కుమార్తెకు నా అల్లుడుకు కుటుంబ పరమైన వివాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. నా కుమార్తెను నా అల్లుడు 4 సంవత్సరాల క్రితమే వదిలేశాడు. కోర్టులో విడాకుల వ్యవహారంపై కేసు నడుస్తోంది. నా కుమార్తెకు ఇద్దరు పిల్లలు. నా కుమార్తెతో పాటు నా మనవడు,మనవరాలిని కూడా నేనే సంరక్షించుకుంటున్నాను. నా అల్లుడు పెట్టిన పోస్టుపై నేను మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి నాపైన, నా తమ్ముడు అంబటి మురళిపైన కొన్ని కామెంట్స్ చేశారు. నా అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారు. కుటుంబ తగాదాన్ని రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారతారని నేను అనుకోలేదు. చిరంజీవి కుటుంబంలో తగాదాలు లేవా.? నాగబాబు కుటుంబంలో తగాదాలు లేవా.? నా పైన పోటీ చేసే కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో తగాదాలు లేవా.? నేను చెప్పాలనుకుంటే చాలా చరిత్ర చెప్పగలను. కానీ కుటుంబాల వివాదాలు రాజకీయాలకు వాడుకునే అంత దుర్మార్గుడిని కాను. నా కూతుర్ని నేను సంరక్షించుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగించి రాజకీయం చేయాలని చూస్తాయి.  కానీ ఈ వ్యవహారంపైన నేనింక మాట్లాడని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie