Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పార్టీలకు కరీంనగర్ సెంటిమెంట్…

0

హైదరాబాద్, అక్టోబరు 16,

కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తు్న్న పార్టీలు… తమ ప్రచారాలను ఇక్కడ నుంచే ప్రారభిస్తున్నాయి. 15న బీఆర్ఎస్, 16న బీజేపీ మీటింగ్ పూర్తికాగా.. 18న కాంగ్రెస్ ఇక్కడ నుంచే ప్రచారం మొదలుపెడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర సాధనకు తనవంతుగా నాయకులకు అండగా నిలిచిన కరీంనగర్ జిల్లా వాసులను తెలంగాణ నాయకులు ఎన్నటికీ మరిచిపోరు. అందుకే కరీంనగర్ జిల్లా అన్ని పార్టీలకు సెంటిమెంట్ జిల్లాగా పేరుగాంచింది. జిల్లా ప్రజల ఆదరాభిమానాలను పొందడానికి ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లాను మొదటి నుంచి సెంటిమెంట్ గా భావించిన కేసీఆర్15న హుస్నాబాద్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 16న జమ్మికుంటలో సభ నిర్వహించి శంఖరావం పూరించారు, 18వ తేదీన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి ప్రచారాలు ప్రారంభించనున్నారు.అయినను పోయి రావలే హస్తినకు…అన్న పదాన్ని మరపింపచేస్తున్నారు కరీంనగర్ వాసులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లానే సెంటిమెంట్ గా భావించి దిల్లీ నాయకులు కరీంనగర్ గల్లీ గల్లీలో తిరగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీలు కరీంనగర్ జిల్లా నుంచే తమతమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఓటరు నాడిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ముక్కోణపు పోటీ ఉండబోతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల ప్రచారాలు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు.కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ ను మళ్లీ హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే సీనియర్ నాయకులతో ఏఐసీసీ పెద్దలు చర్చలు జరుపుతూ జిల్లాలోని రాజకీయ సమీకరణలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.

బీఆర్ఎస్, బీజేపీపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆశయంతో ముందుకు సాగుతోంది. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీంలతో పాటు స్థానిక మహిళా, యువతను ప్రభావితం చేసే విధంగా పలు హామీలు గుప్పించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేకపూజలు చేసి అనంతరం ప్రచార రథాలను ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభించనున్నారుకరీంనగర్ జిల్లాలో బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ హుజురాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించి అక్కడే ఎన్నికల శంఖారావం పూరించనున్నారని సమాచారం.

హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. కేసీఆర్ సభకు దీటుగా ఈ సభను విజయవంతం చేయడానికి ఈటల రాజేందర్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ ను గరంగరం చేస్తూ దిల్లీ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న సభల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు ఆయా పార్టీల నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie