Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రిజర్వేషన్లను ఎత్తేస్తే దేశం అగ్నిగుండమే..

అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకముందే రిజర్వేషన్లను ఎత్తేస్తే ఎలా మా మనుగడ ప్రశ్నార్థకం అయితే మానవ బాంబులమవుతాం నినదించిన బీసి ల అఖిలపక్ష సమావేశం

0

హైదరాబాద్ బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అధ్యక్షతన “రాజ్యాంగ రక్షణ- రిజర్వేషన్ల పరిరక్షణ” పై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున జాతీయ పార్టీలతోబాటు ప్రాంతీయ పార్టీల నాయకులు , విద్యార్థి నాయకులు రాజ్యాంగ నిపుణులు, మేధావులు, ఉద్యమకారులు , వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు తులసి శ్రీమాన్ ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా వ్యవహరించారు.అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకముందే రిజర్వేషన్లను ఎత్తేస్తే ఎలా అనే అంశం పై వివిధ పార్టీల కు చెందిన నేతలు మాట్లాడారు..రిజర్వేషన్ల ఎత్తివేత ఆరోపణలపై ప్రధాని స్పష్టత నివ్వాలి అనే విషయం పై వక్తలు మాట్లాడారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న చర్చను ప్రతిపక్షాలు నేడు జాతీయవ్యాప్తంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఆందోళన చెందుతున్నారనీ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపి పైన ఉన్నదని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ప్రధాని మోదీని అప్పీల్ చేసారు.. రిజర్వేషన్లను ఎత్తేస్తే దేశం అగ్నిగుండం అవుతుందన్నారు..అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకముందే రిజర్వేషన్లను ఎత్తేస్తే ఎలా అని ప్రశ్నించారు.. అట్టడుగు వర్గాల అవకాశాల్ని హారిస్తే చూస్తూ ఊరుకోమన్నారు ..మా మనుగడ ప్రశ్నార్థకం అయితే మానవ బాంబులమవుతామన్నారు.రాజ్యాంగం ద్వారా సిద్ధించాల్సిన రిజర్వేషన్ ఫలాలు నేటికీ బీసీలకు పూర్తిస్థాయిలో చెందకుండానే రిజర్వేషన్లను ఎత్తేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. నేడు అస్తవ్యస్థంగా కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థ వలన దేశంలోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు దక్కాల్సి ఉన్నా, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా చెందాల్సి ఉన్నా ఇవేవీ అమలుకాకుండానే కేవలం అగ్రవర్ణాలకు మాత్రం EWS రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా బీసీలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నదని స్పష్టం చేసారు..బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్రవర్ణ పేదలకు అలవోకగా నీట్,ఐఐటి,యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో ఉద్యోగ నియామకాల్లో లబ్ధి చేకూరుతున్న విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాస్త్రీయంగా, సంఖ్యా పరంగా మాజీ ఎమ్మెల్యే , మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ వివరించారు. తదనంతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ , రాజ్యాంగ నిపుణులు జస్టిస్ చంద్ర కుమార్ , ప్రముఖ రాజనీతి విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ , మాజీ బీజేపీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, సమాజ్వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి , సీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలమల్లేష్ ,మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , సామాజిక వేత్త వీజీఆర్ నారగొని, ప్రొఫెసర్ గాలి వినోద్, బీసీ రాజ్యాధికార సమితి మహిళా అధ్యక్షురాలు బోనం ఊర్మిళ ,హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కిరణ్, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు బీజేపీ నాయకులు ఎనుగంటి రాజు , సిహెచ్ భద్ర, బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు భండారు పద్మావతి ,, బీసీ నాయకులు జక్కే వీరస్వామి , సేనాపతి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie