Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి సోదాలు

0

మంగళగిరి: మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి సోదాలు కలకలం రేపాయి. గురువారం  నిన్న  తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న సోదాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నివాసంలో వారిని  బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారంతో సోదాలు జరుగుతున్నాయి. సుమారు పది కోట్లు వరకు నగదు 25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు , ఎఫ్ డీ లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో  ఉన్న డబ్బు రాజకీయ పార్టీకి సంబంధించి  ఎన్నికల డబ్బా లేక చిట్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బా అనే దానిపై వివరాలు ఐటి అధికారులు సేకరిస్తున్నారు. ఈ నగదు  అధికార పార్టీ నాయకుడికి  చెందినదా అనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు ఇంట్లో ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చాంశానియంగా మారింది..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie