Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సెంటిమెంట్ నమ్ముకున్న షర్మిల…

0

కడప, మన ఇంటికి న్యాయం కోసం వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా?’ మొన్న ఆ మధ్యన యాత్ర సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రధారి మమ్ముట్టి పలికే డైలాగ్ ఇది. ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ డైలాగ్. అయితే రాయలసీమకు ఈ డైలాగ్ దగ్గరగా ఉంటుందన్నది ఒక వాదన. ఇప్పుడు అదే వాదన వినిపిస్తున్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు జగన్ పై గట్టి ఫైట్ చేస్తున్నారు. అయితే తన శక్తి యుక్తులన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. చివరకు సెంటిమెంట్ అస్త్రాలను సైతం వదులుతున్నారు. అది కడప ప్రజలకు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.కడప ఎంపీగా గెలిచి తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేయాలని షర్మిల భావిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశంపై మాట్లాడుతున్నారు. కడప ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు కొంగు చాచి అడుగుతున్నాను న్యాయం చేయండి.. మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి.. మీ వైయస్సార్ బిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి అంటూ సెంటిమెంట్ అస్త్రాలను సంధిస్తున్నారు. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.రాయలసీమలో ఆడబిడ్డది ప్రత్యేక స్థానం. పుట్టింటిని వెతుక్కుంటూ వెళ్లే మహిళకు ఎనలేని ప్రాధాన్యమిస్తారు. తోబుట్టువుగా చూసుకుని శక్తి కొలదిసాయం చేస్తారు. ఇప్పుడు దానినే గుర్తు చేస్తున్నారు షర్మిల. తోడబుట్టిన అన్న తమకు అన్యాయం చేశాడని.. ప్రజలే సోదరులుగా మారి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.కడప వేదికగాకుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది. సోదరుడుతో విభేదించిన షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి షర్మిల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప రాజకీయాలు దడ పుట్టిస్తున్నాయి.కడప నుంచే తేల్చుకోవాలని షర్మిల గట్టిగానే డిసైడ్ అయ్యారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అటు పులివెందులలో సైతం సోదరుడికి చికాకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ప్రచారమే అన్నది కనిపించని పులివెందులలో.. తన గెలుపు బాధ్యతను అర్ధాంగి భారతికి అప్పగించారు జగన్. కడపలో వైసిపి దూకుడుకు చెక్ చెప్పాలని షర్మిల భావిస్తున్నారు. పులివెందులలో సైతం అన్నకు గట్టిగానే బదులిస్తున్నారు. దీంతో భారతి పులివెందులలో క్షణం తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది. ఒకవైపు భారతి, మరోవైపు షర్మిల పోటీపడిప్రచారం చేస్తున్నారు. ఒకరి వ్యాఖ్యలపై ఒకరు గట్టిగానే రిప్లై ఇస్తున్నారుఓ ఇంటర్వ్యూలో వైయస్ భారతి ఏపీలో వైసీపీ నే సింగిల్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చారు షర్మిల. గొడ్డలితో వివేకానంద రెడ్డిని నరికేసినట్టు.. మిగతా వాళ్ళను కూడా నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. అదే సమయంలో కడప వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఓటమితో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక వ్యూహం ప్రకారం వైయస్ భారతి తో పాటు అవినాష్ రెడ్డి పై విమర్శలతో దూసుకెళ్తున్నారు షర్మిల.అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా భిన్నంగా స్పందిస్తోంది. రాయలసీమలోఅన్నను మోసం చెల్లెలు లేదని.. అన్నను విలన్ గా చూపే చెల్లి లేదని.. అన్నను దెబ్బతీయాలని ప్రత్యర్థులతో చేతులు కలిపి చెల్లి లేదని.. చెబుతూ వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఒకపక్క షర్మిల సెంటిమెంట్ అస్త్రం.. మరోవైపు వైసీపీ తిప్పికొట్టే వ్యూహం.. మరి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie