సంక్షిప్త వార్తలు:04-23-2025:ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది.
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్.
హైదరాబాద్
ఎంపి ఈటల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మావారిని దర్శించుకున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు. బాధితులు చిందించిన రక్తం వృథా పోదు. తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు.
విజయవాడ నగరంలో సందడి చేసిన సారంగపాణి చిత్ర యూనిట్

విజయవాడ
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. అమ్మవారిని హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూప కోడవాయుర్, చిత్ర దర్శకుడు ఇంద్రకంటి మోహనకృష్ణ, నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ,ప్రసాదాన్ని దేవస్థానం వేద పండితులు అందజేసారు. సారంగపాణి జాతకం చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మ ను వేడుకున్నారు.
ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి
విశాఖపట్నం
జమ్మూకశ్మీర్, అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి లో విశాఖ వాసి చంద్ర మౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్ము కాశ్మీర్కు ఆరుగురు వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో విషాదం అలముకుంది.
పహల్గామ్ దాడి.. ఖండించిన ప్రపంచ దేశాలు

న్యూఢిల్లీ
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివిధ దేశాల నాయకులు ఎక్స్ లో పోస్టులు పెట్టారు. దాడిలో నష్టపోయిన వారి ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయని యూకే ప్రధాన మంత్రి కేయర్ స్టామర్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మన్ ఛాన్స్లర్ అన్నారు. ఈ సమయంలో యూరప్ మీతో ఉంటుందని ఈయూ కమిషన్ ఛైర్మన్ ఉర్సులా వాన్ డి లెయెన్ ఎక్స్ లో తెలిపారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
