తెనాలి లో మంత్రి నాదెండ్ల పర్యటన
తెనాలి
రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఉదయం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్ లోని శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్క్ మీదగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలోనే పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నారు
ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాసనాలు

గచ్చిబౌలి
ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హాజరైన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, క్రీడాకారులు తాంగ్ -త మార్షల్ ఆర్ట్స్ , రోలర్ స్కేటింగ్ ప్రదర్శన చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాసనాలు చేశారు. తరువాత బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు.
ఉమ్మడి కడప జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు

బద్వేలు
అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో 20 ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూముల పై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో ఉమ్మడి కడప జిల్లా జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అప్పట్లో తహసీల్దార్లుగా పనిచేసిన అనూరాధ (మైదుకూరు), వి.గంగయ్య (పోరుమామిళ్ల) మధుసూదన్ రెడ్డి (బద్వేల్), విజయకుమారి (వీఎన్ఏల్లె), లక్ష్మీనారాయణ (లింగాల), మహబూబ్ బాషా (సింహాద్రిపురం), గుర్రప్ప (జమ్మ లమడుగు), ఉదయభాస్కర్ రాజు (పెండ్లిమర్రి), సువర్ణ (బి.మఠం), సరస్వతి (కమలాపురం) రామచంద్రుడు (కాశినాయన), వెంకటసుబ్బయ్య (వేముల), శంకర్రావు (వల్లూరు) లు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రధానంగా మైదుకూరు, లింగాల, బి.మఠం, జమ్మలమడుగు మండలాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసింది.
బద్వేల్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ నిర్వహించిన అధికారులు

బద్వేలు
స్వర్ణాంధ్ర, స్వచ్ఛభారత్ లో భాగంగా శనివారం బద్వేలు ఆర్టీసీ బస్టాండులో స్వచ్ఛభారత్ చేపట్టిన ఆర్డీవో చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వాకమళ్ళ వెంకట నరసింహారెడ్డి, ఆర్టీసీ డిఎం నిరంజన్, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ ఫారెస్ట్ ఆఫీసర్ తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
