సంక్షిప్త వార్తలు:05-02-2025

brife news

సంక్షిప్త వార్తలు:05-02-2025:దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది.

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయం

హైదరాబాద్
దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది.

సోషల్ జస్టిస్ ప్రంట్ కన్వీనర్ వీజీఆర్ నారగోని మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘బీసీల కులగణన ముస్లింలతో కలిపి గందర గోళం చేశారు. బీసీలకు తాత్కాలిక రాయితీలు, సంస్కరణలు కాదు. అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సభాధ్యక్షుడు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి బీసీ వ్యతిరేకి అని మండిపడ్డారు.

అంబేద్కర్ విగ్రహం వివాస్పదంగా కావడంతో కాంగ్రెస్ అభిమానుల ఆగ్రహం

Ambedkar Statue : జాతి గర్వించేలా.. నేడే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

సికింద్రాబాద్
బీఆర్ఎస్ s పార్టీ నాయకులు మరియు కార్పొరేటర్ వ్యవహరిస్తున్న తీరుపై అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు  తీవ్రం గా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాజ్యంగం రూపకర్త బీఆర్ అంబేద్కర్ ఒక పార్టీ, ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని, దేశానికి ఆదర్శ దైవం అని , ఆయనని కొనియాడారు.  బీఆర్ఎస్ నాయకుల శైలి హాస్యాస్పదం గా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.  సమాజంలో వ్యక్తిగత దౌర్జన్యానికి పాల్పడి,కులం పేరుతో దూషిస్తున్నారని,ప్రభుత్వ అధికారులను బెదిరించడం సరి కాదని, పార్టీ అభిమానులు మండిపడ్డారు.

బీఆర్ఎస్  కార్పొరేటర్ సభిత అనిల్ కిషోర్  మీద , అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు  పిర్యాదు చేసి,క్రిమినల్ కేసులు పెట్టారు. దాంతో బీఅర్ఎస్ నాయకులు అల్వాల్ డీసీని వ్యక్తి గత దూషణలకు పాల్పడడం, సరికాదని ఆయనకు మద్దతు తెలపడడానికి మున్సిపల్ కార్యాలయానికి తాము రావడం జరిగింది అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, సర్కిల్ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సోలార్ పవర్ ప్లాంట్ లో వ్యక్తి అత్మహత్య

మీ భూమిలో 'సౌర విద్యుత్'తో కాసులు పండించొచ్చు! - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

వికారాబాద్
పెద్దేముల్  లోని ఇందుర్ బీమ్ సోన్ సోలార్ పవర్ ప్లాంట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు గోపాల్ పూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి గా గుర్తించారు.  సోలార్ పవర్ ప్లాంట్  7 సంవత్సరాలుగాటెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్య కు గలా కారణాలు తెలియాల్సి ఉంది

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఈటల, మల్లారెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేదెప్పుడో? | general

మేడ్చల్
ధాన్యం కొలుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి లు సూచించారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్, కేశవరం, జగంగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ప్రారంభించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను సొసైటీలోనే అమ్మాలని రైతులకు ఎంపి ఈటల రాజేందర్ సూచించారు. రైతులు దలారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి దాన్యాన్ని అమ్మాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి తో కలిసి కొనుగోలు కేంద్రంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Related posts

Leave a Comment