సంక్షిప్త వార్తలు:05-05-2025:తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ అందించేందుకు, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అమేయ కృషి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. రూ.3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభ సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మారిన ఆయనకు ప్రభుత్వం తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్ర అభివృద్దిలోభాగమయిన నితిన్ గడ్కారి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆసిఫాబాద్
తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ అందించేందుకు, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అమేయ కృషి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. రూ.3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభ సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మారిన ఆయనకు ప్రభుత్వం తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణకు అవసరమైన మరో రోడ్ కనెక్టివిటీ కోసం ఆయనకు అభ్యర్థన. తెలంగాణకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ వరకు అలాగే నాందేడ్, పుణె, నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్ కనెక్టివిటీ అందించాలని కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
భూభారతి పైలట్ ప్రాజెక్టుగా తెట్టేకుంట గ్రామం

నల్గోండ
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ అవాస గ్రామమైన తేట్టేకుంట భూ భారతి చట్టం 2025 ని పురస్కరించుకొని జిల్లా లోనినకిరేకల్ మండలమును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించుటకు షెడ్యూలు ను రెండు టీమ్ లు గా ఏర్పాటు చేయనైనది తెట్టెకుంట గ్రామంలో , తహసీల్దార్ నాయబ్ తహశీల్దార్ లు , గిర్దావర్లు, సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ హాజరైనారు..
మహిళ అనుమానస్పద మృతి

విజయనగరం
గరివిడి మండలం అర్తమూరులో ఓ మహి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన యడ్ల ఆసిరి తల్లి (70) సోమవారం తెల్లవారుజామున నిప్పు అంటించుకుని మృతి చెందినట్టు గ్రామానికి చెందిన కొందరు, ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి అగ్నికి ఆహుతయినట్టు మరికొందరు చెబుతున్నారు.
ఆమె గత నాలుగు మాసాలుగా కాలుకి ఇన్ఫెక్షన్ అయి తీవ్రంగా బాధ పడటంతో నొప్పి తీవ్రతను భరించలేక నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందన్ని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఒక నిండు ప్రాణం అగ్ని కీలలకు ఆహుతయిన దుర్ఘటన ఇవాళ ఉదయం ఆ గ్రామంలో చోటు చేసుకుంది. మృతిరాలికి ఇద్దరు కుమారులు,మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మిషన్ భగీరథ అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్
మెట్ పల్లి
మిషన్ భగీరథ ప్రగతి పరిస్థితులపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పంపును సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైపులైన్ పనులు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి సరఫరా సమస్యలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేల తగిన చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా తాగునీటికి ఏలాంటి ఇబ్బందులు రానివద్దని అందుకు తగిన చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఎక్కడైనా లీకేజీ సమస్య ఉన్నచో వెంటనే సరి చేయాలన్నారు. వంద శాతం పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వార నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీటిని అందించాలని అన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ లో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్స్ కి గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఎ జి ఎం సందీప్ గారితో మాట్లాడి వెంటనే జీతాలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత విభాగాల ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు లో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

ఏలూరు
పోలవరం ప్రాజెక్టు ను సోమవారం నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా పి పి ఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి,రాకేష్ తోతేజ, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సి ఎస్ ఎం ఆర్ ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్ట్ సి ఈ కే నరసింహ మూర్తి, ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందం, అధికారులకు వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్టత పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయింది.
