Movie news : సినిమా వార్తలు

Adivi Sesh's Pan-Indian movie

Movie news : సినిమా వార్తలు:అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్  డకాయిట్ ఫైర్ గ్లింప్స్ తెలుగ, హిందీలో రిలీజ్ అయ్యింది.  ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది.  శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్ లో శేష్ ఆమెను “జూలియట్” అని పిలుస్తాడు, అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు.

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ ‘డకాయిట్’ ఫైర్ గ్లింప్స్ తెలుగు, హిందీలో రిలీజ్- డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్  డకాయిట్ ఫైర్ గ్లింప్స్ తెలుగ, హిందీలో రిలీజ్ అయ్యింది.  ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది.  శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్ లో శేష్ ఆమెను “జూలియట్” అని పిలుస్తాడు, అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు.  కానీ వెంటనే అతని వాయిస్ మారుతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తా అని మిస్టీరియస్ స్మైల్ తో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.  నెక్స్ట్ ఎపిసోడ్, ఖైదీ యూనిఫాం లో జైలు వ్యాన్ లో వున్న శేష్ కూల్ గా తన నోటి నుండి ఒక కీని బయటకు తెస్తాడు.  తర్వాత ఓ రైలు వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది. చివరి సన్నివేశంలో, మృణాల్ అతని పక్కన కూర్చుంటుంది, శేష్ ఫైరింగ్ చేస్తాడు.  ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన ఓ గొప్ప కథకు ఇది నాంది.

విజువల్ గా డకాయిట్ ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్  పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. మదనపల్లె యాసలో అదరగొట్టాడు. అతని వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా వున్నాయి. హిందీ వెర్షన్‌కు కూడా తనే డబ్బింగ్ చెప్పారు. అది అద్భుతంగా వచ్చింది.మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆమె పాత్ర వెనక కథ చాలా ఆసక్తి కలిగిస్తుంది. అనురాగ్ కశ్యప్ ప్రజెన్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది.దర్శకుడు షానియల్ డియో విజువల్ ప్రజెంటేషన్ అదరగొట్టాడు. టీజర్ సినిమా స్కేల్ ఎంత బిగ్గర్ గా వుంటుందో తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది.సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన డకాయిట్ గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోందని ‘ఫైర్’ గ్లింప్స్ ప్రామిస్  చేస్తోంది. ఈ చిత్రం ఈ క్రిస్మస్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఈ హాలిడే బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తొందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం.

Read more:Patna : పార్టీకి తలనొప్పిగా మారిన లాలు కొడుకు

Related posts

Leave a Comment