Pushpa-2 : రజాకార్, పుష్ప-2 సినిమాలకు అవార్డులను తిరస్కరించాలి

pushpa 2 movie

Pushpa-2 : రజాకార్, పుష్ప-2 సినిమాలకు అవార్డులను తిరస్కరించాలి:రజాకార్ సినిమాకు, పుష్ప-2 సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ కు ఇచ్చిన గద్దర్ అవార్డులను తిరస్కరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రజాకార్, పుష్ప-2 సినిమాలకు అవార్డులను తిరస్కరించాలి

రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను కించపరిచే సినిమాలకు అవార్డులా..?
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

హనుమకొండ
రజాకార్ సినిమాకు, పుష్ప-2 సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ కు ఇచ్చిన గద్దర్ అవార్డులను తిరస్కరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను అవమానపరుస్తూ తీసిన రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు ఇవ్వడం సిగ్గు చేటైన చర్య అన్నారు.  నాడు సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిందని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, జమీందారులకు, జాగిర్దార్లకు వ్యతిరేకంగా భూమి పంచాలని, వెట్టిచాకిరి నుండి విముక్తి కావాలని నినాదంతో, బాంచన్ కాల్మొక్థ అనే బానిస బతుకులు పోవాలని సాగిన పోరాటాన్ని హిందువులకు, ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ తీసిన  రజాకార్ సినిమాకి ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు రావడం సిగ్గుచేటు అని అన్నారు.

ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూములను పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండా పార్టీకి దక్కిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పటేల్ సైన్యాలతో గ్రామాలపై పడి ప్రజలపై దాడి చేసి చంపించారని, నేడు అదే తీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ  తీసిన సినిమాలకు ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం అమరవీరులను అవమానపరచడమే అన్నారు. అలాగే సమాజంలో విష సంస్కృతిని పెంచి పోషించే విధంగా ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం సరికాదని, ఇలాంటి పాత్రలకు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నదని ప్రశ్నించారు. అలాగే మూఢనమ్మకాలను అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చిన కల్కి సినిమాకి  కూడా ఉత్తమ సినిమా అవార్డు రావడం భారత సమాజాన్ని మూఢ విశ్వాసాలవైపు తీసుకెళ్లడమేనని అన్నారు. ఆర్ఎస్ఎస్ కు వంతపాడే సినిమాలకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు ఇవ్వడం ఏంటని విమర్శించారు.ఇలాంటి సినిమాలకు అవార్డుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more:సంక్షిప్త వార్తలు : 30-05-2025

Related posts

Leave a Comment