KannappaMovie : కన్నప్ప సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్:మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి, నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కన్నప్ప చిత్రంపై హైకోర్టు విచారణ: సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్
మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి, నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిన్న (జూన్ 17, 2025) ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ నెల 27న చిత్రం విడుదల కానున్నందున ఆ ప్రక్రియను నిలువరించాలని కోరారు. అయితే, దీనికి హైకోర్టు అంగీకరించలేదు.
బదులుగా, ప్రతివాదులైన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్, నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి. వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.సినిమా విడుదలైన తర్వాత అభ్యంతరకర విషయాలు ఉంటే వాటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో కన్నప్ప చిత్రం విడుదలకు హైకోర్టు నుంచి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.
Read also:Palnadu Farmers : పల్నాడులో కౌలు రైతుల ఆత్మహత్యలు
