Bollywood : షెఫాలీ మృతి: మీడియా తీరుపై వరుణ్ ధావన్ ఆగ్రహం, జాన్వీ కపూర్ మద్దతు

Varun Dhawan Slams Media Over Shefali Jariwala's Demise Coverage, Janhvi Kapoor Extends Full Support

Bollywood : షెఫాలీ మృతి: మీడియా తీరుపై వరుణ్ ధావన్ ఆగ్రహం, జాన్వీ కపూర్ మద్దతు:నటి షెఫాలీ జరివాలా ఆకస్మిక మరణం తర్వాత మీడియా ప్రవర్తించిన తీరుపై వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సహనటి జాన్వీ కపూర్ పూర్తి మద్దతు తెలిపారు. విషాద సమయాల్లో సెలబ్రిటీల కుటుంబాలకు గోప్యత మరియు గౌరవం ఇవ్వాలని మీడియాను కోరుతూ వరుణ్ చేసిన విజ్ఞప్తిని ఆమె సమర్థించారు.

షెఫాలీ అంత్యక్రియలు: మీడియా ప్రవర్తనపై బాలీవుడ్ ఆగ్రహం

నటి షెఫాలీ జరివాలా ఆకస్మిక మరణం తర్వాత మీడియా ప్రవర్తించిన తీరుపై వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సహనటి జాన్వీ కపూర్ పూర్తి మద్దతు తెలిపారు. విషాద సమయాల్లో సెలబ్రిటీల కుటుంబాలకు గోప్యత మరియు గౌరవం ఇవ్వాలని మీడియాను కోరుతూ వరుణ్ చేసిన విజ్ఞప్తిని ఆమె సమర్థించారు. నటి షెఫాలీ జరివాలా అంత్యక్రియల సందర్భంగా మీడియా ప్రవర్తించిన తీరుపై వరుణ్ ధావన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. “మరొక ఆత్మకు సంబంధించిన విషాద వార్తను మీడియా సున్నితత్వం లేకుండా కవర్ చేసింది.

ఒకరి దుఃఖాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇది చూసేందుకు అందరూ చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. ఎవరూ తమ చివరి యాత్రను ఇలా కవర్ చేయాలని కోరుకోరు” అని వరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన పోస్ట్‌లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావన చేయనప్పటికీ, షెఫాలీ మరణం తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

వరుణ్ ధావన్ చేసిన ఈ పోస్ట్‌కు జాన్వీ కపూర్ పూర్తి మద్దతు పలికింది. వరుణ్ పెట్టిన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, “ఫైనల్లీ సమ్‌వన్ సెడ్ ఇట్ (ఎట్టకేలకు ఎవరో ఒకరు ఈ విషయం చెప్పారు)” అని రాసుకొచ్చింది. తద్వారా, విషాద సందర్భాల్లో మీడియా కవరేజ్ విషయంలో వరుణ్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. బాధలో ఉన్నవారికి గోప్యత ఇవ్వాలన్న పిలుపును ఆమె బలపరిచింది.

రెండ్రోజుల క్రితం నటి షెఫాలీ జరివాలా గుండెపోటుకు గురయ్యారు. ఆమె భర్త పరాగ్ త్యాగి వెంటనే బెల్వ్యూ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అయితే, మరణానికి కచ్చితమైన కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని ‘రిజర్వ్‌’లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన ఆమె అంత్యక్రియలకు బిగ్ బాస్ 13 సహచరులు షెహనాజ్ గిల్, మహిరా శర్మ, పరాస్ ఛబ్రా, ఆర్తీ సింగ్, రష్మీ దేశాయ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.

Read also:Char Dham : ఉత్తరాఖండ్: ప్రతికూల వాతావరణం తర్వాత చార్‌ధామ్ యాత్ర తిరిగి మొదలు

 

Related posts

Leave a Comment