Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?

Lufthansa Flight to Hyderabad Returns to Frankfurt Amidst Bomb Threat Rumors and Landing Denial

Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?:హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది

లుఫ్తాన్సా విమానానికి తప్పిన ల్యాండింగ్

హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది.ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం.

అయితే, లుఫ్తాన్సా సంస్థ ఈ వార్తలను ఖండించింది. హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ అవడానికి అనుమతి లభించకపోవడమే వెనక్కి మళ్లించడానికి కారణమని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్ లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం విమానం నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

హైదరాబాద్‌లోని తన తల్లిని కలిసేందుకు వస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ చేయడానికి అనుమతి రాలేదని తమకు చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇదే విమానంలో మళ్లీ బయలుదేరుతామని పేర్కొన్నారు,” అని తెలిపారు. ప్రయాణికులందరికీ రాత్రి బస ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు.

Read also:Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!

 

Related posts

Leave a Comment