UPI Payments : యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు!

upi payments

UPI Payments :యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

యూపీఐలో కొత్త మార్పులు: పెద్ద మొత్తాల పేమెంట్స్‌కు ఛార్జీలు!

యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. కొత్త ఛార్జీలు యూజర్లపై నేరుగా ప్రభావం చూపవు, వ్యాపారులే భరించాలి. ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ కేరాఫ్ అని చెప్పొచ్చు. కిరాణా దుకాణంలో చిన్నపాటి వస్తువుల కొనుగోలు నుంచి పెద్ద లావాదేవీల వరకు, ప్రతి ఒక్కరూ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ త్వరలోనే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూర్చే యోచనలో భాగంగా, రూ. 3,000లకు పైగా చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక నిర్ణయం లక్షలాది మంది వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, వీటికి సహకరించాలనే లక్ష్యంతో, జీరో ఎండీఆర్ పాలసీకి స్వస్తి పలకాలని కేంద్రం భావిస్తోంది. 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో MDR విధానం కారణంగా, యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. అయితే, ఇప్పుడు లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో వెల్లడించింది.

ఛార్జీలు ఎలా? ప్రస్తుతం యూపీఐ ద్వారా రూ. 3 వేలకుపైగా చేసే ట్రాన్సాక్షన్లపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉంది. పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ప్రసక్తి లేదని సమాచారం.

Read also:ChatGPT : ప్రపంచంలోనే చాట్‌జీపీటీ వాడకంలో భారత్ మొదటి స్థానం: AI చాట్‌బాట్‌లు ఇవే

Related posts

Leave a Comment