ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

telangana cabinet meeting
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నెల రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ఆదేశాలు విడుదలయ్యాయి.

ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఉండే ఆలస్యాన్ని తగ్గించి, పాలనను మరింత చురుకుగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ చర్య వెనక ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి నెలలో తొలి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ భేటీలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమైన అంశాలపైనే సమావేశాలు జరగగా, ఇప్పుడు వాటి సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలపై వేగవంతంగా చర్చించి తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది.

ఈ కొత్త పాలనాశైలి ద్వారా పాలనలో పారదర్శకత, ప్రజల సమస్యలపై స్పందన పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Read : Revanth Reddy:ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్

Related posts

Leave a Comment